- Advertisement -
HomeతెలంగాణYadadri Bhuvanagiri | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు డీఎస్పీలు దుర్మరణం.. ఏఎస్పీకి తీవ్ర గాయాలు

Yadadri Bhuvanagiri | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు డీఎస్పీలు దుర్మరణం.. ఏఎస్పీకి తీవ్ర గాయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yadadri Bhuvanagiri : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh) కు చెందిన ఇద్ద‌రు డీఎస్పీలు మృత్యువాత ప‌డ్డారు. చౌటుప్పల్ మండలం(Choutuppal mandal) కైతాపురం (Kaithapuram) జ‌రిగిన ఈ ప్రమాదంలో ఏఎస్పీతో పాటు కారు డ్రైవ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ చక్రధర్ రావు (AP Intelligence DSP Chakradhar Rao), డీఎస్పీ శాంతారావు (DSP Shantha Rao), అడిషనల్ ఎస్పీ ప్రసాద్ (Additional SP Prasad) స్కార్పియోలో విజ‌య‌వాడ (Vijayawada) నుంచి హైద‌రాబాద్‌ (Hyderabad) కు వ‌స్తున్నారు. చౌటుప్పల్ మండలం కైతాపురం వ‌ద్ద‌కు చేరుకున్న వీరి వాహ‌నం ముందున్న లారీ స‌డ‌న్ బ్రేక్ వేయ‌డంతో డ్రైవ‌ర్ కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ స్కార్పియో అదుపు త‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొట్టి రాంగ్‌రూట్‌లో ఎదురుగా వ‌స్తున్న లారీపైకి దూసుకెళ్లింది. అతివేగంతో బ‌లంగా ఢీకొట్ట‌డంతో కారులో ఉన్న ఇద్ద‌రు మృతి చెందగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

- Advertisement -

కారులో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ చక్రధర్‌రావు, డీఎస్పీ శాంతారావు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగ్ రావు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఎల్‌బీన‌గ‌ర్ కామినేని ద‌వాఖాన‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఓ కేసు ప‌ని మీద న‌లుగురు క‌లిసి విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న‌ట్లు తెలిసింది. ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు మృతి చెంద‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Andhra Pradesh Home Minister Vangalapudi Anitha) దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి ప్ర‌క‌టించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News