అక్షరటుడే, ఇందూరు : CP : పోలీస్ సబ్ కంట్రోల్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య Police Commissioner Sai Chaitanya ఆదేశించారు. ప్రధాన జంక్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( artificial intelligence – AI ) టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలు CCTV ఏర్పాటు చేయాలన్నారు.
నిజామాబాద్ నగరం Nizamabad city లోని ప్రధాన జంక్షన్లను శుక్రవారం సాయంత్రం సీపీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్, బోధన్ బస్టాండ్, అర్సపల్లి చౌరస్తా, చార్ భాయ్ పెట్రోల్ బంక్, వీక్లీ మార్కెట్, కంఠేశ్వర్ చౌరస్తా టీ జంక్షన్ మొదలగు చోట్ల ఉన్న సబ్ కంట్రోల్‌లను పునరుద్ధరించి, వాటిని త్వరితగతిన వాడకంలోకి తేవాలన్నారు.
CP | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ
ఆయా జంక్షన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీలతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ట్రాఫిక్ వయోలేషన్ పై తగు చర్యల గురించి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అవసరమైనటువంటి ప్రధానమైన జంక్షన్ లలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లను జీబ్రా లైన్లను స్టాఫ్ లైన్స్ ను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
వివిధ జంక్షన్లలో అవసరమైన చోట వెంటనే ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు కోసం ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ పి.ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (వెల్ఫేర్) తిరుపతి తదితరులు సీపీ వెంట ఉన్నారు.