అక్షరటుడే, వెబ్‌డెస్క్: Conversion Racket : అక్రమ మతమార్పిడి భారీ ముఠా కార్యకలాపాలు వెలుగుచూశాయి. ఈ తన నెట్వర్క్ ను అనేక రాష్ట్రాలకు విస్తరించింది. హిందువుల అమ్మాయిల Hindu girls నే టార్గెట్ చేస్తూ.. పెద్ద మొత్తంలో మత మార్పిడులకు పాల్పడింది. చివరికి పోలీసులకు చిక్కడంతో ఈ భారీ ముఠా దుర్మార్గం వెలుగుచూసింది.
అక్రమ మత మార్పిడుల ముఠా కీలక సూత్రధారి ఢిల్లీకి చెందిన అబ్దుల్ రెహమాన్. ఇతగాడు సుమారు ఏడు రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో బాలికలు, యువతులను ట్రాప్ చేశాడు. వారిని బలవంతంగా మతం మార్పించాడు. పాపం పండి, పోలీసులకు దొరికిపోయాడు.
Conversion Racket | ఎలా వెలుగు చూసిందంటే..
సదర్ ప్రాంతానికి చెందిన సోదరీమణులు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా కోల్‌కతా Kolkata, ఇతర రాష్ట్రాలకు చెందిన పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో గోవాకు చెందిన ఎస్.బి. కృష్ణ(ఆయేషా)ను విచారించారు. ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. ఢిల్లీలోని ఓల్డ్ ముస్తఫాబాద్‌లో ఉండే అబ్దుల్ రెహమాన్ గురించి ఆమె వివరించింది. అబ్దుల్ రెహమాన్ తన పేరును మహేంద్ర పాల్గా పేరు మార్చుకున్నాడు.
అలా అనేక మంది అమ్మాయిలను మత మార్పిడులు చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో అతడి కుమారులు అబ్దుల్ రహీమ్, అబ్దుల్లా, శిష్యుడు జునైద్ ఖురేషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Conversion Racket | నిందితులను విచారించగా..
అబ్దుల్ రెహమాన్ Abdul Rehman అనేక మంది బాలికలను మతం మార్పించినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ వెల్లడించారు. బాధిత బాలికలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జార్ఖండ్, బరేలీ, రాయ్బరేలి, అలీగఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
Conversion Racket | అమ్మాయిల బ్రెయిన్ వాష్..
అబ్దుల్ రెహమాన్ అమాయక యువతులను బ్రెయిన్ వాష్ చేసి, మతం మార్పించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ దుర్మార్గ ముఠా సభ్యులు పలు మార్గాలలో హిందూ అమ్మాయిలను సంప్రదించేవారు. వారిని ఢిల్లీ Delhi కి తీసుకొచ్చి వసతి గృహాల్లో ఉంచేవారు. అనంతరం ఈ యువతులను అబ్దుల్ రెహమాన్ తన ఇంటికి పిలిపించేవాడు. అక్కడ ఇస్లాం బోధించేవాడు. ఆ అమ్మాయిలతో బలవంతంగా కల్మా చేయించేవాడు. వారికి నికాహ్ (ఇస్లామిక్ వివాహ కార్యక్రమం) చేపడతారు. తర్వాత యువతులను బయటకు వెళ్లనివ్వకుండా బంధించేవాడు.
Conversion Racket | మౌలానా కలీం సిద్ధిఖీ వద్ద పని చేస్తూ..
జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మౌలానా కలీం సిద్ధిఖీ వద్ద అబ్దుల్ రెహమాన్ పనిచేసేవాడు. సిద్ధిఖీ జైలుకు వెళ్లాక.. ముఠాకు రెహమాన్ నాయకత్వం వహించాడు. వీరి మాయలో అమాయక అమ్మాయిలతోపాటు ఉన్నత విద్యావంతులైన యువతులు కూడా ఇందులో పడిపోయారు.
ఈ ముఠా చేపట్టే మతమార్పిడికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.