అక్షరటుడే, గాంధారి: SP Rajesh Chandra | భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి మండల (Gandhari mandal) కేంద్రంలో ఎస్సై ఆంజనేయులుతో (SI Anjaneyulu) కలిసి పర్యటించారు.
వాగులను పరిశీలించి, వాహనాల రాకపోకల ఇబ్బందులు, తదితర వివరాలపై అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ (Nizamabad) వెళ్లే మార్గంలో పెద్ద గుజ్జుల వద్ద గత ఏడాది వంతెన పైనుంచి నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలు స్తంభించాయని ఎస్సై వివరించారు. అలాగే బాన్సువాడ మార్గంలో సర్వపూర్ వాగు పరిస్థితిపై ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వాగులు, వంతెనలు దాటవద్దని, సెల్ఫీలు, చేపల వేటకు వెళ్లవద్దని, అత్యవసర సాయం కోసం 100కు డయల్ చేయాలని ఎస్పీ సూచించారు.