ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering)​, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. రాష్ట్రంలో మూడేళ్లకు ఒకసారి ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని పలు కాలేజీలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

    ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల పలు కాలేజీలు తాము ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు (High Court)ను ఆశ్రయించాయి. అయితే వారి పిటిషన్​ను తోసిపుచ్చిన హైకోర్టు ఆరు వారాల్లోగా కాలేజీల ఫీజులు నిర్ణయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించడానికి కమిటీ వేసింది.

    Engineering Colleges | కమిటీ సభ్యులు వీరే..

    తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGHEC) ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని ఫీజుల నిర్ధారణ కమిటీ ఛైర్మన్​గా ప్రభుత్వం నియమించింది. సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఎసీడీడీ కమిషన్, డైరెక్టర్ ఎన్ క్షితిజ, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, టీజీసీహెచ్ఈ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, హైదరాబాద్ జేఎన్​టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఓయూ డీన్ క్రిష్ణయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

    Engineering Colleges | 2025–28 కాలానికి..

    రాష్ట్రంలో 2022లో ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కాలేజీల ఫీజులను పెంచారు. తాజాగా 2025–28 వరకు ఫీజులను నిర్ణయించడానికి కమిటీని వేశారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది. అలాగే ఆయా కాలేజీల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అనంతరం ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

    More like this

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...