అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన ఘనత బీఆర్ఎస్దని గాయత్రి షుగర్స్ (Gayatri Sugars) ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీడీసీ కార్యాలయంలో (CDC Office) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ (KTR) లింగంపేట (Lingmapet) పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో దళితులపై జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దళితున్ని టిప్పర్‌తో ఢీకొటించి చంపించింది కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. నేరేళ్ల ఘటన ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
కేటీఆర్ లింగంపేట వచ్చి దళితులపై మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమన్నారు. దళితబంధు పేరుతో మీ నాయకులు కమీషన్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yella Reddy Constituency) మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని.. అందుకే ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు (MLA Madan Mohan Rao) పట్టం కట్టారని తెలిపారు. నియోజకవర్గానికి రూ.25 కోట్ల నిధులు తెచ్చి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తున్నారని, మినీ ట్యాంక్ బ్యాండ్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. రూ. నాలుగున్నర కోట్లతో బస్టాండ్ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని తెలిపారు. అగ్రి ఫ్యాక్టరీ తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.
అభివృద్ధి ఎక్కడుందో కేటీఆర్ వస్తే చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ఎమ్మెల్యే ఒక్క రూపాయి ఆశించకుండా ప్రజల కోసం పని చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. ప్రజలకు మంచి చేస్తే మరోసారి పట్టం కట్టేవారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో దళిత విభాగం జిల్లా నాయకుడు బంటు మోహన్, సీడీసీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, కో ఆపరేటివ్ మాజీ వైస్ ఛైర్మన్ రాజలింగం, లింగంపేట మండల నాయకుడు సంజీవరెడ్డి, సీనియర్ నాయకుడు షేక్ వసీం పాల్గొన్నారు.