More
    HomeతెలంగాణEducation Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైసలిస్తేనే గాని పనికావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక లొసుగును సాకుగా చూపి పనికి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఐదేళ్లకోసం అనుమతులను రెన్యువల్​ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని సిబ్బంది యాజమాన్యాల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. అడినంత ఇవ్వకపోతే పని జరగడం లేదు. దీంతో ఏమీ చేయలేక చేతులు తడపాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.

    జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు (private schools) సుమారు 300కు పైగా ఉంటాయి. ప్రతి స్కూల్​ అనుమతిని ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (DEO office) సంబంధిత సెక్షన్ అధికారులు ఉంటారు. మూడు నుంచి ఐదు మండలాలకు కలిపి ఒక సెక్షన్ అధికారిని నియమిస్తారు. ఇలా డీఈవో కార్యాలయంలో సుమారు ఆరుగురు సెక్షన్ అధికారులు ఉన్నారు. తమ మండలాల పరిధిలో అన్ని పత్రాలను సరి చూసి ప్రైమరీ స్కూల్ రెన్యువల్, హైస్కూల్ రెన్యూవల్​ను డైరెక్టరేట్​కు ఫార్వర్డ్ చేయడం వీరి ప్రధాన విధి.

    Education Department | సెక్షన్ కోసం పోటీ..

    డీఈవో కార్యాలయంలో (DEO office) జూనియర్ అసిస్టెంట్​తో పాటు సీనియర్ అసిస్టెంట్లు ప్రైవేటు పాఠశాలల సెక్షన్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ ఉత్తర మండలం, దక్షిణ మండలం, నిజామాబాద్ రూరల్​లో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలు ఉంటాయి. ఈ పరిధిలో సెక్షన్ ఉన్నవారికి ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కార్యాలయంలోని ఓ జూనియర్ అసిస్టెంట్ ఏకంగా తనకు ఆదాయం ఉన్న సెక్షన్ ఇవ్వాలని బహిరంగంగానే అడిగినట్లు తెలిసింది. డిప్యుటేషన్​పై కార్యాలయానికి వచ్చిన వారికి ఇచ్చారని.. తనకు మాత్రం ఇవ్వలేదంటూ నిలదీసినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ అంతా జిల్లా విద్యాశాఖ అధికారి (District Education Officer) దృష్టికి కూడా వెళ్లింది.

    Education Department | నిబంధనలపై నిక్కచ్చిగా…

    డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ నిబంధనల అమలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల నూతన అనుమతులు, అలాగే రెన్యువల్ కోసం వచ్చే వారికి ప్రభుత్వ నిబంధనలు (government rules) పాటించాలని స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎటువంటి పత్రాలు లేకున్నా అనుమతులను నిరాకరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో నూతన అనుమతుల కోసం సుమారు 40 దరఖాస్తులు డీఈవో కార్యాలయానికి అందాయి. అయితే సరైన పత్రాలు లేని కారణంగా డీఈవో వాటిని వెనక్కి పంపించారు. కానీ కొందరు సెక్షన్ అధికారులు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఎంతోకొంత అప్ప చెప్పగానే రెన్యువల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ ఆదాయం తగ్గిందంటూ ఓ అధికారి స్వయంగా మాట్లాడడం చర్చకు దారితీసింది.

    Education Department | జూనియర్ అసిస్టెంట్​పై ఫిర్యాదు..

    ఇదిలా ఉంటే డీఈవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న ఒకరిపై సహోద్యోగులంతా కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి అశోశ్​కు (District Education Officer Ashok) ఫిర్యాదు చేశారు. సదరు ఉద్యోగి వ్యవహార శైలిపై కార్యాలయం సిబ్బంది మొత్తం అసహనంతో ఉన్నట్లు తెలిసింది. సదరు ఉద్యోగిని ఏదైనా పాఠశాలకు పంపించాలంటూ డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ అంశం టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్​తో (TNGOs President Suman) పాటు కలెక్టర్ (Nizamabad Collector) దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

    Education Department | వసూలు చేస్తే చర్యలు తప్పవు..

    – అశోక్, డీఈవో

    ప్రైవేటు పాఠశాలల రెన్యువల్ విద్యాశాఖ నిబంధనల ప్రకారం చేయాలి. అన్ని పత్రాలను నిషితంగా పరిశీలించి రెన్యువల్ చేయాలి. అలాకాకుండా ఎవరైనా వసూళ్లకు పాల్పడి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.

    More like this

    India vs Pakistan Match | ఆసియా కప్​లో భారత్ విజయభేరి.. చిత్తుగా ఓడిన పాక్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India vs Pakistan Match : దుబాయ్​ Dubai వేదికగా ఆసియా కప్ Asia cup...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం.. గోడ కూలిపోయి మరో ఇద్దరి దుర్మరణం.. నాలాలో కొట్టుకుపోయి ఇద్దరి గల్లంతు..

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad | భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొట్టింది. ఆదివారం (సెప్టెంబరు 14)...

    Padmasali Hostel | పద్మశాలి వసతి గృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఘన విజయం

    అక్షరటుడే, ఇందూరు: Padmasali Hostel | నిజామాబాదు Nizamabad నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతి గృహం‌ Hostel  అధ్యక్షుడిగా...