అక్షరటుడే, భీమ్‌గల్: Anganwadi centers | అంగన్‌వాడీ కేంద్రాలు అసౌకర్యాలకు నెలవుగా మారాయి. సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా పలుచోట్ల టీచర్లు (Anganwadi teachers) అందుబాటులో లేకపోవడం.. మరికొన్ని చోట్ల సరుకులను పక్కదారి పట్టిస్తుండడంతో క్షేత్రస్థాయిలో విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
జిల్లాలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్ ప్రాజెక్టుల్లో మొత్తం 1,500ల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి (Anganwadi centers). ఆయా ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,06,234 మంది చిన్నారులున్నారు. అయితే కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వీరికి క్షేత్రస్థాయిలో పౌష్ఠికాహారం సరిగ్గా అందడం లేదనే ఆరోపణలున్నాయి.
Anganwadi centers | అధ్వానంగా నిర్వహణ
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా మారింది. జిల్లాకు మారుమూల ఉన్న భీమ్‌గల్ మండలంలో (Bheemgal mandal) అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు లేరు. గత కొనేళ్లుగా గతేడాది విద్యార్థుల పేర్లతో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. అలాగే చిన్నారులున్న కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు సరిగ్గా రావడం లేదని ఆరోపణలున్నాయి. ఆయాలే టీచర్లుగా కొనసాగుతున్నారు. వారానికి ఓసారి వచ్చి టీచరు హాజరు వేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. మరికొన్ని కేంద్రాల్లో కేవలం ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని రోడ్డుపై చిన్నారులను కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. వారికి పౌష్టికాహారం సైతం రోడ్డుమీదే అందిస్తున్నారు. అంతేకాకుండా పలుచోట్ల పౌష్ఠికాహారాన్ని (nutritious food) పక్కదారి పట్టిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
Anganwadi centers | అద్దె గదుల్లో కేంద్రాలు
జిల్లాలోని అనేక చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఇరుకు గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భీమ్‌గల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ (Bheemgal ICDS project) పరిధిలో 283 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందులో కేవలం 263 కేంద్రాల్లో ఉపాధ్యాయులున్నారు. 106 కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. 177 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Anganwadi centers | పర్యవేక్షణ కరువు..
గర్భినులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనేది సర్కారు లక్ష్యం. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (pre-school education), పౌష్ఠికాహారం, ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటి కార్యక్రమాలు అంగన్‌వాడీ పరిధిలోనే ఉంటాయి. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పుట్టిన బిడ్డకు ఐదేళ్లు నిండే వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందిస్తుంది. అలాగే వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా అంగన్‌వాడీ కేంద్రాలదే. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో సత్ఫలితాలు అందడం లేదనే చర్చ వినిపిస్తోంది. కేవలం వారోత్సవాలు, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసే సమయంలో తప్ప అధికారులు మిగతా టైంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని, పరిశీలనలు, తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. భీమ్‌గల్ పరిధిలో మొత్తం 11 సెక్టార్లున్నాయి. 11 మంది పర్యవేక్షకులు ఉండాలి. కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు.
Anganwadi centers | పర్యవేక్షకులు లేక ఇబ్బందులు
– స్వర్ణలత, సీడీపీవో
భీమ్‌గల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 11 సెక్టార్లున్నాయి. 11 మంది పర్యవేక్షకులు ఉండాలి. కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. పౌష్టికాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాం.