అక్షరటుడే, ఇందల్వాయి: Tirmanpally | మండలంలోని తిర్మన్‌పల్లిలో (Tirmanpally) డెంగీ(Dengue) కలకలం సృష్టించింది. గ్రామంలో ఓ వ్యక్తికి డెంగీ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎల్పీఓ శ్రీనివాస్ (DLPO Srinivas), తహశీల్దార్ వెంకట్ రావు, ఎంపీడీఓ అనంతరావు, ఎంపీఓ రాజ్‌కాంత్, ఇందల్వాయి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు క్రిస్టినా, మండల అరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ ఆధ్వర్యంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు.
బాధితుడి ఇంటితో పాటు గ్రామంలోని పలు ఇళ్ల ఎదుట దోమల నివారణ మందులు స్ప్రే చేయించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించారు. కాలనీలో హెల్త్ క్యాంప్ (Health camp) నిర్వహించి, ఫీవర్ సర్వే (Fever survey), ప్రైడే డ్రైడే కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా జ్వరంతో బాధపడితే ఆస్పత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, కారోబార్ నరేందర్ , ఏఎన్ఎం శారద భానుప్రియ ఆశా కార్యకర్తలు బండ ప్రమీల, పాశం జ్యోతి, ప్రియాంక, అంగన్వాడీ కార్యకర్త వనజ, బొక్క గంగాధర్, చెక్ పవర్ సాయిలు, ప్రవీణ్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.