- Advertisement -
HomeతెలంగాణSri Chaitanya | నగరంలో ‘శ్రీ చైతన్య’ ఆధ్వర్యంలో ర్యాలీ

Sri Chaitanya | నగరంలో ‘శ్రీ చైతన్య’ ఆధ్వర్యంలో ర్యాలీ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Sri Chaitanya | శ్రీ చైతన్యలో అభ్యసించే విద్యార్థులకు ఉత్తమ విద్య అందుతుందని డైరెక్టర్ నాగేంద్ర(Director Nagendra) తెలిపారు. జేఈఈ మెయిన్స్​లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు(All India First Rank) వచ్చిన నేపథ్యంలో మంగళవారం గూపన్​పల్లి బ్రాంచ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకుల ప్రణాళిక, విద్యార్థుల పట్టుదలతో వందలాదిమంది విద్యార్థులు(Students) ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. వందలోపు ఆలిండియా ర్యాంకులు పది మందికి వచ్చాయన్నారు. ఐదు వందలలోపు 31 మందికి, వెయ్యిలోపు 40 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. వరుసగా మూడో సంవత్సరం మొదటిస్థానాన్ని సాధించామని వివరించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎం రవికుమార్​, ఏజీఎం మాధవరావు, నిజామాబాద్ జిల్లా ఇన్​ఛార్జి అశోక్, స్కూల్ అకడమిక్ ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి, స్కూల్​ ప్రిన్సిపాళ్లు సుధీర్, లత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News