అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. డిజిటల్ చెల్లింపులతో మంచి ఆదరణ పొందిన ఈ కంపెనీ ఆన్లైన్ బెట్టింగ్‌ను (Online Betting) ప్రొత్సహిస్తోందని ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.
తెలంగాణ పోలీసులు (Telangana Police) ఆన్లైన్ బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, యూ ట్యూబర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సైతం విజయ్‌దేవరకొండ, రాణా, ప్రకాశ్‌రాజు, మంచు లక్ష్మికి నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఈ క్రమంలో మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) కార్డ్స్, MPL రమ్మీ వంటి వాటిని పేటీఎం ప్రోత్సహిస్తోందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Case on PAYTM | గేమింగ్ చట్టం ప్రకారం
తెలంగాణ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌పై నిషేధం ఉంది. అయినా కొందరు వ్యక్తులు ఇతర రాష్ట్రాల అడ్రస్‌లతో గేమ్‌లు ఆడుతూ అప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేటీఎం ఎంపీఎల్ కార్డ్స్, ఎంపీఎల్ రమ్మీ గేమ్‌లను ప్రోత్సహిస్తోందని శుక్రవారం ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం 2000, 2008లోని సెక్షన్ 66 రెడ్ విత్ 43 , తెలంగాణ గేమింగ్ చట్టం సెక్షన్ 3ఏ కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంస్థ ప్రమోట్ చేస్తున్న యాప్స్‌లో జూదం కంటెంట్ ఉంటోందని.. తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు.