అక్షరటుడే నిజాంసాగర్: Junior Colleges | విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం (Inter Nodal Officer Sheikh Salam) సూచించారు. నిజాంసాగర్ (Nizamsagar), పిట్లం (Pitlam) ప్రభుత్వ జూనియర్ కళాశాలలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నిజాంసాగర్ కళాశాలలో (Nizamsagar Junior College) లెక్చరర్లతో సమావేశమయ్యారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదివి కళాశాలకు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం పిట్లం జూనియర్ కళాశాలలో (Pitlam Junior College) తరగతులకు విద్యార్థులతో పాటు హాజరయ్యారు. నూతన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్ శేఖర్‌ను అభినందించారు.