అక్షరటుడే, బోధన్: Mla Sudarshan Reddy | మున్సిపల్ కార్యాలయం(Muncipal Office)లో వృథాగా ఉన్న వాహనాల మరమ్మతులు చేయించేందుకు అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(Mla Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణ శివారులోని మున్సిపల్ కార్యాలయాన్ని, డంపింగ్ యార్డు(Dumping Yard)ను పరిశీలించారు. యార్డులో నిర్వహిస్తున్న తడిపొడి చెత్తను వేరుచేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం చెడిపోయిన వాహనాలను పరిశీలించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో(Sub Collector Vikas Mahato), కమిషనర్ వెంకట నారాయణ(Commissioner Venkata Narayana) తదితరులున్నారు.
