అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | వాల్‌స్ట్రీట్ ఆల్‌టైం హై స్థాయిల వద్ద కొనసాగుతుండగా.. మన మార్కెట్లు మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. హెల్త్‌కేర్(Health care) మినహా అన్ని రంగాల స్టాక్స్ సెల్లాఫ్‌కు గురవుతున్నాయి. ప్రధానంగా స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 119 పాయింట్ల నష్టంతో ప్రారంభమెంది. అక్కడినుంచి 530 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 52 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 166 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 571 పాయింట్ల నష్టంతో 81,613 వద్ద, నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో 24,864 వద్ద కొనసాగుతున్నాయి.
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం(Trade deal) విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, కంపెనీల Q1 ఎర్నింగ్స్ ఆశాజనకంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటో(Auto), మెటల్, బ్యాంక్, ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి. బజాజ్ గ్రూప్ షేర్లతోపాటు శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, ఎటర్నల్, పవర్‌గ్రిడ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నష్టాల బాటలో ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో చాలా కాలం తర్వాత విక్స్(VIX) 7 శాతం పెరిగింది. నిఫ్టీ 25 వేల పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతోంది.
Stock Market | పీఎస్‌యూ బ్యాంక్, పవర్ స్టాక్స్‌లో సెల్లాఫ్..
పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank), పవర్ స్టాక్స్‌లో అమ్మకాల తీవ్రత ఎక్కువగా ఉంది. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్, పవర్ ఇండెక్స్‌లు 1.43 శాతం పడిపోగా.. యుటిలిటీ 1.36 శాతం, మెటల్, పీఎస్‌యూ 1.32 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. కమోడిటీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రా, కమోడిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి. ఐటీ, టెలికాం సెక్టార్‌లలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రమే ఫ్లాట్‌గా ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 1.38 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.04 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Losers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 27 కంపెనీలు నష్టాలతో ఉండగా.. 3 కంపెనీలు మాత్రమే లాభాలతో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్(Bajaj finance) 5.04 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.63 శాతం, పవర్‌గ్రిడ్ 1.67 శాతం, ఇన్ఫోసిస్ 1.60 శాతం, ఎటర్నల్ 1.46 శాతం నష్టాలతో ఉన్నాయి.
Gainers:ఎయిర్‌టెల్ 0.55 శాతం, సన్‌ఫార్మా 0.35 శాతం, టీసీఎస్ 0.03 శాతం లాభాలతో సాగుతున్నాయి.