ePaper
More
    HomeసినిమాWar 2 Trailer | వార్ 2 ట్రైల‌ర్ విడుద‌ల‌.. ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టేశారంతే..!

    War 2 Trailer | వార్ 2 ట్రైల‌ర్ విడుద‌ల‌.. ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టేశారంతే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: War 2 Trailer | తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు హుషారెక్కించే సినిమాలు క్యూ క‌డుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు పెద్ద సినిమాలు లేక‌ థియేటర్లు బోసిపోతే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) విడుదలతో మళ్లీ సందడి మొదలైంది. జూలై 24న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను సాధించగా, ఇప్పుడు అంద‌రి దృష్టి ‘వార్ 2’ (War–2) పైనే ఉంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి స్క్రీన్‌పై పోరాడనుండటం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా భారీగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం చేపట్టారు.

    War 2 Trailer | చెమ‌ట ప‌ట్టించారు..

    సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా వార్ 2 ట్రైలర్‌ను జూలై 25న మూడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం) విడుద‌ల చేశారు. ఇద్ద‌రు బ‌డా స్టార్స్ మ‌ధ్య‌పోరాటాన్ని చాలా అద్భుతంగా ట్రైల‌ర్‌లో చూపించారు. ఇది కన్నుల పండుగ‌గా అనిపించింది. హృతిక్ రోష‌న్‌తో కియారా అద్వానీ (Kiara Advani) లిప్ లాక్ సీన్ కూడా ట్రైల‌ర్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది. టీజర్‌కు వచ్చిన స్పందన చూసి, ఎన్టీఆర్ అభిమానులు మరిన్ని ఎలివేషన్స్ కోరారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌లో తారక్ పాత్రను కూడా హైలైట్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్ పెంచారు. YRF స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ చిత్రంతో.. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లో (Bollywood) ర‌చ్చ చేసేందుకు రెడీ అయ్యారు.

    ఇక వార్ 2 (War 2) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. పాన్ ఇండియా సినిమా (pan-India film) కావడంతో ముంబైతో పాటు హైదరాబాద్ లేదా విజయవాడలో (Hyderabad or Vijayawada) భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు తారక్, హృతిక్ ఇద్దరూ హాజరైతే, అభిమానులు పూనకంతో ఊగిపోవడం గ్యారంటీ అంటున్నారు. చీఫ్ గెస్ట్ ఎవరవుతారు? అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక సమాచారం కోసం కొద్దిరోజులూ వేచి చూడాల్సిందే. ‘హరిహర వీరమల్లు’తో మొదలైన సక్సెస్ రైడ్‌కి ‘వార్ 2’ మరింత బలం చేకూర్చేలా ఉంది. ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా, టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...