అక్షరటుడే, వెబ్‌డెస్క్: CCRAS Notification | సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) గ్రూప్ ఏ, బీ, సీ కేడర్‌లలో పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి నుంచి పీజీ, వైద్య విభాగాల్లో విద్యార్హత కలిగిన వారు అర్హులు. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 394.
గ్రూప్ ఏ, బీ, సీ విభాగాల్లో ఆయుర్వేద (Aurveda), ఫార్మసీ, లాబ్ టెక్నిషియన్, అడ్మినిస్ట్రేటివ్, డాటా ఎంట్రీ, క్లరికల్, టెక్నికల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టును అనుసరించి పదో తరగతి (Tenth class), ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంఫార్మసీ, ఎండీ/ఎంఎస్. సంబంధిత ఫీల్డ్‌లో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి : పోస్ట్‌ను బట్టి 27 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు.
వేతన శ్రేణి :
గ్రూప్ ఏ పోస్టులు : రూ. 15,600 నుంచి రూ. 39,100.
గ్రూప్ బీ పోస్టులు : రూ. 9,300 నుంచి రూ. 34,800.
గ్రూప్ సీ పోస్టులు : రూ. 9,300 నుంచి రూ. 34,800.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : ఆగస్టు ఒకటో తేదీనుంచి 31వ తేదీ వరకు..
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(Computer Based Test) నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్ : https://ccras.nic.in