అక్షరటుడే, బోధన్:Siddapur | మండలంలోని సిద్ధాపూర్ క్వారీ(Siddapur quarry)లో మంగళవారం కూలీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ క్వారీలో టిప్పర్లలో ఇసుకను డోజర్ల(Dozers)తో నింపుతున్నారు. దీంతో తాము ఉపాధి కోల్పోతున్నామని కల్దుర్కి కూలీ(Kaldurki workers)లు ఆందోళనకు దిగారు. టిప్పర్లలో ఇసుకను నింపనివ్వకుండా అడ్డుకున్నారు.