అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala లో స్వామివారి దర్శనానికి సమయం ఎక్కువగా పడుతోంది. ప్రస్తుతం దర్శనం కోసం 21 కంపార్టుమెంట్ల (compartments)లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
నిన్న వేంకటేశ్వర స్వామిని 68,838 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,212 మంది భక్తులు devotees తలనీలాలు సమర్పించారు. రూ. 4.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.