ePaper
More
    HomeజాతీయంTamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ హత్యకు మూడేళ్ల కూతురే సాక్ష్యంగా నిలిచింది. ఆ చిన్నారి ఇచ్చిన సమాచారంతో పోలీసులు హత్య కేసును ఛేదించారు.

    వేలూరు Vellore లో భరత్ అBharat నే వ్యక్తి ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, కూతురితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి భరత్​ను పొడిచి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మొదట గుర్తుతెలియని వ్యక్తుల దాడిగా భావించారు. కానీ, విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగుచూశాయి. నిందితులైన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

    Tamil Nadu : ఏమి జరిగిందంటే..

    వేలూరు జిల్లా ఒడుకత్తూర్‌ వద్ద కుప్పంపాళ్యంలో చోటుచేసుకుందీ ఘటన. ఈ గ్రామానికి చెందిన భారత్‌(36) చెన్నైలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్​గా పనిచేస్తున్నాడు. కాగా, భరత్​కు బెంగళూరుకు చెందిన నందిని(26)తో ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు(4, 3 వరుసగా ఏళ్ల వయస్సు) ఉన్నారు.

    చెన్నైలో పనిచేసే భరత్​.. భార్యాపిల్లలను చూసేందుకు ప్రతి వారం సెలవు రోజుల్లో గ్రామానికి వచ్చేవాడు. అలా ఈ నెల (జులై) 21న భరత్​ ఇంటికొచ్చాడు. సరకుల కోసం భార్య, చిన్న కూతురి daughter ని తీసుకుని బైక్‌పై దుకాణానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై అడ్డంగా ఉన్న కొబ్బరిమట్టలను తట్టుకుని అదుపుతప్పి పడిపోయాడు.

    కాగా, అక్కడే మాటువేసిన ఓ దుండగుడు పదునైన కత్తితో భారత్‌పై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భరత్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

    విచారణలో భరత్ భార్య నందిని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మెల్లిగా చిన్న కుమార్తెను ఆరా తీశారు. దీంతో ఆ చిన్నారి.. నాన్నపై సంజయ్‌ మామ దాడి చేసినట్లు చెప్పింది. వెంటనే నందినిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. బండారం అంతా వెలుగుచూసింది.

    Tamil Nadu : వివాహేతర సంబంధం..

    భరత్​ పని నిమిత్తం చెన్నై Chennai వెళ్తుండటంతో నందిని Nandini ఇంట్లో పిల్లలతో ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో వీరి ఇంటి ఎదురుగా ఉండే సంజయ్​(21)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బండారం తెలిసి, భార్యను భారత్‌ హెచ్చరించాడు. దీంతో అతడిపై పగ పెంచుకున్న భార్య, ప్రియుడు.. భరత్​ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

    అలా పక్కా ప్రణాళిక వేసుకుని, దాని ప్రకారమే భరత్​ను ఇరువురు కలిసి కడతేర్చారు. కానీ, కూతురి సాక్ష్యంతో చేసిన పాపం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు Police.. నిందితులను కోర్టులో హాజరుపర్చి, రిమాండ్​కు తరలించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...