Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు
Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస వర్షాలకు సచివాలయంలో పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలో పెచ్చులు కిందపడ్డాయి.

సచివాలయంలో వారం రోజులుగా రిపేర్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పెచ్చులు ఊడటంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కాగా, గత ఫిబ్రవరిలో ఇదే సచివాలయలో పీవోపీ పార్టిషన్ ఊడిపడింది. పెచ్చులు కిందపడిపోయాయి.

Secretariat : గతంలోనూ..

ముఖ్యమంత్రి Chief Minister ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఊడిపడ్డాయి. అదే సమయంలో రామగుండం Ramagundam మార్కెట్ కమిటీ Market Committee ఛైర్మన్ కారు రాగా, ఆ వాహనంపై పడ్డాయి. సదరు వాహనంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏమి కాలేదు. తాజాగా మళ్లీ పీఓపీ పెచ్చులు కింద పడటంతో భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

Secretariat : స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థ

సెక్రటేరియట్​లో పెచ్చులు ఊడిపడిన ఘటనపై దాని నిర్మాణ సంస్థ షాపూర్ పల్లోంజీ Shahpur Pallonji స్పందించింది. సాధారణ పనుల్లో భాగంగా లైటింగ్, కేబుల్ పనులు చేపట్టినట్లు చెప్పింది. ఇది నిర్మాణంలో లోపం వల్ల వచ్చిన సమస్య కాదంది. తాము చేపట్టింది కాంక్రీట్ పని కాదని పేర్కొంది.

సచివాలయం స్ట్రక్చర్​కు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాణ సంస్థ తెలిపింది. వర్షానికి ఊడి పడింది కేవలం జీఆర్సీ ఫ్రేం అని తెలిపింది. లైటింగ్, కొత్త కేబుల్స్ కోసం జీఆర్​ఏసీ డ్రిల్లింగ్​ చేపడుతున్నారు. దీనివల్ల దీంతో జీఆర్సీ దెబ్బతింటోంది. కానీ, నిర్మాణంలో నాణ్యత లోపం లేదు. పనులు పూర్తయి రెండేళ్లు అవుతోందని వెల్లడించింది.