Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం
Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో గురువారం వివరాలు వెల్లడించారు.

గత నెల 16 న విద్యానగర్ కాలనీకి చెందిన జంగం నరేష్ రాత్రి పడుకునే ముందు ఇంటి ఎదుట బైకు పార్క్ చేశారు. తెల్లారేసరికి దొంగలు గేటు తాళం పగుల గొట్టి బైకు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అటుగా రెండు బైకులపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా.. వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నారు.

Kamareddy : పలు చోట్ల దొంగతనాలు..

నిజామాబాద్, కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్ పురా, శ్రీరాంనగర్ కాలనీ, బాసరలో బైకులు దొంగిలించినట్లు విచారణలో తేలింది. దీంతో నిందితుల నుంచి ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులను రిమాండుకు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఒకరు మైనర్​ కాగా, మరో వ్యక్తి పేరు యూనుస్​ అని సీఐ వివరించారు.