అక్షరటుడే, నిజాంసాగర్: Forest Department | పెద్ద కొడప్‌గల్ మండలంలోని (Pedda Kodapgal mandal) కాటేపల్లి తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండా శివారులోని 118, 275 సర్వే నంబర్లలో సుమారు 1700 ఎకరాల అటవీ భూమి (forest land) ఉండగా, వీటిలో 70–80 ఎకరాల్లో తండావాసులు చదును చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు.
Forest Department | పంటలను ధ్వంసం చేసిన అధికారులు..
అటవీ భూమిని చదును చేయడంతో ఫారెస్ట్ అధికారులు (forest department officials) తండాకు చేరుకుని, ఆక్రమిత భూముల్లో పంటలు ధ్వంసం చేశారు. ఈ మేరకు గురువారం జేసీబీలతో చేరుకుని పంటలను తొలగించారు. డివిజనల్ అటవీశాఖ అధికారిణి సునీత మాట్లాడుతూ.. 10 హెక్టార్లలో భూమిని చదును చేసి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు పోలీసు బందోబస్తుతో ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన 70 నుండి 80 ఎకరాల భూములను విడతల వారీగా మా ఆధీనంలోకి తీసుకుంటామని అన్నారు. అటవీ భూములు కబ్జా చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, పంటలు ధ్వంసం చేయడంతో తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.