అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers | జిన్నింగ్ మిల్లుల Ginning mills యజమానులు, సీసీఐ CCI అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట భారీ మోసానికి తెర లేపారు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసిన దళారులు, మిల్లర్లు సీసీఐకి ఎక్కువ ధరకు పత్తిని విక్రయించారు. రైతులు లబ్ధి పొందాల్సిన చోట జిన్నింగ్ మిల్లుల యజమానులు లబ్ధి పొందారు. అసలు రైతులే కాని వారిపేరిట నకిలీ పత్రాలు సృష్టించి సీసీఐకి పత్తి విక్రయించారు. తాజాగా విజిలెన్స్ విచారణ Vigilance investigationలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Farmers | నకిలీ ధ్రువపత్రాల జారీ
రైతుల farmers నుంచి సీసీఐ CCI మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తోంది. అయితే జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతుల దగ్గర తక్కువ ధరకు పత్తి కొన్నారు. అనంతరం తమ మిల్లులో పని చేసే కూలీలు, సిబ్బంది పేరిట ఆ పత్తిని సీసీఐకి విక్రయించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట దందా చేశారు. గుంట భూమి లేకున్నా.. అసలు పత్తి సాగు చేయని వారి పేరిట పత్తి విక్రయించారు. ఇందు కోసం నకిలీ ధ్రువ పత్రాలు సైతం సృష్టించారు. ఏఈవో AEOలు జిన్నింగ్ మిల్లర్లతో కుమ్మకై నకిలీ సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీటి ఆధారంగా మార్కెటింగ్ శాఖ అధికారులు తాత్కాలిక ధ్రువపత్రాలు ఇచ్చారు. వీటితో జిన్నింగ్ మిల్లర్లు సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందారు.
మార్కెటింగ్ శాఖ అధికారులు Marketing Department Officers జారీ చేసిన 60 వేల తాత్కాలిక ధ్రువపత్రాల్లో సగానికంటే ఎక్కువ నకిలీవేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. కాగా గత అక్టోబరులో హైదరాబాద్ Hyderabadలోని ఒక హోటల్లో జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ అధికారులు సమావేశమై అక్రమ కొనుగోళ్ల పై చర్చలు జరిపినట్లు సమాచారం.