Kamareddy SP
Kamareddy SP | వాగుల వద్ద సెల్ఫీల కోసం సాహసాలు చేయవద్దు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాల వద్ద సెల్ఫీల కోసం ఎగబడి ప్రమాదాలు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra) సూచించారు. గురువారం ఆయన పాల్వంచ మండల (Palvancha mandal) కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు.

Kamareddy SP | రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి..

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల నదులు, వాగులు, వంకలు, చెరువులు (canals and ponds) పొంగి ప్రవహించి వంతెనల పైనుంచి నీరు ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. కాలి నడకన, వాహనాలతో ప్రజలు వాగులు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్లకూడదన్నారు. పశువులను కాపలా కు నదులు, వాగుల పరిసర ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడదని సూచించారు.

Kamareddy SP | భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం..

జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు, వాగులు, నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ (district police department) తరపున 24 గంటలు తమ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా అలర్ట్​ చేశామని చెప్పారు. ఎవరికైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసుల సేవలను పొందాలని కోరారు.