అక్షరటుడే, ఇందూరు: STU Nizamabad | గతేడాది జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ(PRC)ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్(STU District President Secretaries Dharmender), శ్రీకాంత్(Srikanth) అన్నారు. గురువారం నగరంలోని ఆయా పాఠశాలల్లో సంఘ సభ్యత్వం నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది గడిచినా పీఆర్సీని అమలు చేయలేదని, ప్రభుత్వం పెండింగ్ బిల్లు(Pending Bills)లను చెల్లించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటే.. అడ్హక్ పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ కార్యదర్శి మల్లయ్య అఫ్జల్ బేగ్, జిల్లా సహాధ్యక్షుడు కాంతారావు, ఉపాధ్యక్షులు సాయిబాబా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.