ePaper
More
    HomeతెలంగాణCollector Nizamabad | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Collector Nizamabad | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని పలు కార్యాలయాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, ఎరువుల గిడ్డంగి, తహశీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ముందుగా పీహెచ్​సీని పరిశీలించారు.

    Collector Nizamabad | సిబ్బంది విధుల్లో ఉన్నారా..?

    హాజరు పట్టిక ప్రకారం వైద్యాధికారి, సిబ్బంది విధుల్లో ఉన్నారా.. లేదా అని తెలుసుకున్నారు. పీహెచ్ సీలో అందిస్తున్న వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్లను(Medical Officers) విచారించారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School), ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి మెనూ ప్రకారం ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. నీటి వసతి, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను గమనించారు. విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగేలా చూడాలని ఎంఈఓ రాములు, హెచ్ఎం సతీష్ కు సూచించారు. గ్రామాభివృద్ధి కమిటీ తోడ్పాటుతో  విద్యార్థులకు ఐడీ కార్డులు(Students ID Cards), క్రీడా దుస్తులు(Sport Dresses) సమకూర్చడం పట్ల కలెక్టర్ అభినందించారు.

    Collector Nizamabad | భూభారతి దరఖాస్తుల పరిష్కారం..

    భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహశీల్దార్ రవీందర్(Tahsildar Ravinder)​ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు, పేర్ల నమోదు కోసం వచ్చిన వాటిని వెంటనే పరిశీలిస్తూ.. అర్హులకు ఆమోదం తెలపాలన్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ కింద నిర్ణీత రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు సత్వరమే ప్రభుత్వ ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. అలాగే పీఏసీఎస్ ఎరువుల గోడౌన్ సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు.

    Collector Nizamabad | ఇందిరమ్మ ఇళ్లపై విచారణ..

    మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Houses) కలెక్టర్ సందర్శించారు. నిర్మాణాలను తొందరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వపరంగా అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని సందర్శించి, అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో మనోహర్ రెడ్డికి ఆదేశించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...