అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని.. బాగా చదువుకుని విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.
గాంధారి (Gandhari) మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను (Kasturba School) ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శిల్పను విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని అడిగారు.
గతేడాది వందశాతం ఉత్తీర్ణత సాధించామని ఆమె పేర్కొనగా ఈ ఏడాది సైతం పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రభుత్వ కళాశాలలోనూ (Government junior college) పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రేణుకా చావన్, ఎంపీడీవో రాజేశ్వర్, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్