ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​IB Notification | డిగ్రీతో ఐబీలో కొలువులు.. 3,717 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌

    IB Notification | డిగ్రీతో ఐబీలో కొలువులు.. 3,717 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:IB Notification | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. డిగ్రీ విద్యార్హతతో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టు(Executive post)లను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీని ద్వారా జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌(General central service), గ్రూప్‌ సీ(నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారికి లెవెల్‌-7 వేతన శ్రేణితో మొదటి నెల నుంచే లక్ష రూపాయల వరకు వేతనం అందుతుంది. నోటిఫికేషన్‌(Notification) పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    మొత్తం పోస్టులు : 3,717. ఇందులో జనరల్‌ కేటగిరిలో 1,537 పోస్టులుండగా.. ఓబీసీ(OBC) కేటగిరిలో 946, ఈడబ్ల్యూఎస్‌లకు 442, ఎస్సీలకు 566, ఎస్టీలకు 226 పోస్టులను రిజర్వ్‌ చేశారు.

    విద్యార్హత: ఏదైనా డిగ్రీ(Any Degree).
    వయో పరిమితి : ఆగస్టు 10 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
    వేతనం : లెవల్‌ 7 ప్రకారం వేతన శ్రేణి రూ. 44,900 నుంచి రూ. 1,42,400 గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అలవెన్స్‌లు లభిస్తాయి. అన్ని కలుపుకుని ఉద్యోగ ప్రారంభంలోనే నెలకు లక్ష రూపాయల వరకు వేతనం అందే అవకాశాలున్నాయి.
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా.
    దరఖాస్తు గడువు : ఆగస్టు 10.
    పరీక్ష ఫీజు : మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 550. అన్‌రిజర్వ్‌డ్‌(Unreserved), ఈడబ్ల్యుఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ. 650.
    పరీక్ష తేదీ : ప్రకటించాల్సి ఉంది.
    పరీక్ష విధానం : రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. టైర్‌ -1 పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానం(Objective type)లో, టైర్‌ -2 డిస్క్రిప్టివ్‌గానూ ఉంటుంది.
    టైర్‌ -3లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
    టైర్‌ 1, 2, 3 లలో అభ్యర్థులు చూపిన ప్రతిభతోపాటు రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. అనంతరం అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేస్తారు.
    పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌: https://www.mha.gov.in

    More like this

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...