ePaper
More
    HomeతెలంగాణBC Reservations | బీసీలకు వెన్నుపోటు పొడిచిన బీఆర్​ఎస్​ : పీసీసీ చీఫ్​

    BC Reservations | బీసీలకు వెన్నుపోటు పొడిచిన బీఆర్​ఎస్​ : పీసీసీ చీఫ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BC Reservations | బీసీలకు బీఆర్​ఎస్​ వెన్నుపోటు పొడిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్​ పెద్దలతో చర్చించడానికి సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు(PCC President), పలువురు నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్​గౌడ్​ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు, కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge), లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ(Rahul Gandhi)కి వివరించామన్నారు.

    బీసీ రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్​ఎస్​ వ్యతిరేకిస్తున్నాయని మహేశ్​గౌడ్​ విమర్శించారు. బీఆర్​ఎస్(BRS)​ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం ఉన్న రిజర్వేషన్లను 22శాతానికి తగ్గించి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అసెంబ్లీలో బీసీ బిల్లులకు ఆమోదం తెలిపి తాజాగా యూటర్న్​ తీసుకుందని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు(Ramachandra Rao) వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.

    BC Reservations | తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చాలి

    బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చాలని మహేశ్​గౌడ్​ డిమాండ్​ చేశారు. ఇదే అంశంపై ఖర్గే, రాహుల్​ గాంధీ రెండు గంటల పాటు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాడతామని రాహుల్‌, ఖర్గే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

    BC Reservations | బీసీలకు న్యాయం చేస్తాం

    బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్​ లక్ష్యమని మహేశ్​గౌడ్​ అన్నారు. తెలంగాణ కుల గణన చేపట్టిన తీరు, బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం సాయంత్రం ఇండియా కూటమి నేతలకు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇస్తామన్నారు. రాహుల్​ గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో కులగణన చేపట్టామని వివరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...