అక్షర టుడే నిజాంసాగర్: KTR | బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Former MLA Hanmant Shinde) కేట్ కట్‌చేసి సంబురాల్లో పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి(Former MPP Pattolla Jyothi Durga Reddy) ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో అచ్చంపేట (acchampet) సొసైటీ ఛైర్మన్ నర్సింహారెడ్డి నాయకులు విఠల్ రెడ్డి మనోహర్, రమేష్ గౌడ్, హైమద్ హుస్సేన్, గుమస్తా శ్రీనివాస్, శ్రావణ్, గౌరయ్య, వెంకటేశం, బేగరి రాజు, లింగా గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గోరేమియా, మరుపల్లి రాములు, పిట్టల్ రెడ్డి, విఠల్ గౌడ్ అంజయ్య, నాందేవ్తోపాటు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
KTR | విద్యార్థులకు పండ్ల పంపిణీ
నిజాంసాగర్(Nizam sagar) మండలంలోని మాగి గ్రామంలో కేటీఆర్ జన్మదిన (KTR Birthday) వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కమ్మరి కత్తా అంజయ్య, నాయకులు నాందేవ్ తదితరులు ఉన్నారు.
KTR | మహమ్మద్ నగర్లో..
మహమ్మద్ నగర్ (mahammad nagar) మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గున్కుల్ సొసైటీ(Gunkul Society) ఛైర్మన్ వాజిద్ అలీ, నాయకులు గంగారెడ్డి, దాఫెదర్ విజయ్, సంగమేశ్వర్ గౌడ్, మహేందర్, లక్ష్మారెడ్డి మనీష్ రెడ్డి, నరేష్, శ్రీధర్ రెడ్డి, చందర్ జీవన్ తదితరులు ఉన్నారు.
KTR | జుక్కల్ మండల కేంద్రంలో..
జుక్కల్ మండల కేంద్రంలో కేటీఆర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిందే ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. బైక్ ర్యాలీ తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలో..
బిచ్కుంద మండల కేంద్రంలో..
బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
మద్నూర్ మండల కేంద్రంలో..
మాగి గ్రామంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ..
మహమ్మద్ మండల కేంద్రంలో..
పిట్లం జూనియర్ కళాశాలలో..
పిట్లం మండల కేంద్రంలో..