అక్షరటుడే, ఇందూరు: Double Bedroom Houses | అర్బన్ నియోజకవర్గంలో దీపావళి (Diwali) లోపు 3,500 ఇళ్లను మంజూరు చేసి, అర్హులైన పేదలకు అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి (Congress party) 20 నెలలు గడిచినా.. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని విమర్శించారు. అర్బన్‌లో సుమారు 40 వేల మంది పేదలు ఇల్లు లేని వారు ఉన్నారన్నారు.
Double Bedroom Houses | నాగారంలో డబుల్ ఇళ్లు..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం నిత్యం తన క్యాంప్ ఆఫీస్‌కు 20 దరఖాస్తులు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని వివరించారు. గత ఎమ్మెల్యే సమక్షంలో కేవలం బీఆర్ఎస్ తొత్తులకు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే పలుసార్లు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
Double Bedroom Houses | ఇందిరమ్మ ఇళ్లపై..
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Houses) సంబంధించి 8,627 దరఖాస్తులు అందాయని, ఇందులో 1,732 అర్హత సాధించాయి. 483 ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ వేశారన్నారు. 89 ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు న్యాలం రాజు, స్రవంతి రెడ్డి, నాగోల్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.