ePaper
More
    Homeబిజినెస్​Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్​ ఇచ్చారు. ఆయనకు చెందిన కంపెనీలు, పలు సంస్థల్లో గురువారం ఉదయం దాడులు చేపట్టారు. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసు(Money Laundering Case)లో భాగంగా ఢిల్లీ, ముంబైల్లోని కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

    Anil Ambani | యెస్​ బ్యాంక్​ రుణ మోసం కేసులో..

    అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ గ్రూప్ యెస్​ బ్యాంక్​ నుంచి 2017–19 మధ్య రుణం తీసుకుంది. ఈ రుణాలు తీసుకోవడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు(CBI Case) నమోదు చేసింది. దీంతో తాజాగా ఈడీ దాడులు చేపట్టింది. యెస్ బ్యాంక్ రిలయన్స్(Yes Bank Reliance) అనిల్ అంబానీ గ్రూప్ కింద ఉన్న RAAGA కంపెనీలకు సుమారు రూ. 3 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అయితే ఇందులో భారీగా అక్రమాలు జరిగాయి. సరైన పత్రాలు పరిశీలించకుండానే బ్యాంక్​ అధికారులు రుణాలు మంజూరు చేశారు. దీని కోసం బ్యాంక్​ ప్రమోటర్లు డబ్బులు అందుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

    Anil Ambani | 35 ప్రాంతాల్లో దాడులు

    యెస్​ బ్యాంక్​ మోసం కేసులో ఈడీ అధికారులు గురువారం 35 ప్రాంతాల్లోని 50 సంస్థలపై దాడులు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 25 మందికి పైగా వ్యక్తులను కూడా ప్రశ్నించారు. ఎలాంటి అర్హత లేని కంపెనీలకు సరైన పత్రాలు లేకుండానే రుణం మంజురు చేశారని అధికారులు పేర్కొన్నారు. డొల్లా కంపెనీ(Dolla Company)లకు నిధులను మళ్లించారని తెలిపారు.

    Anil Ambani | ఏడాదిలో రెట్టింపైన రుణాలు

    గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)లో జరిగిన అవకతవకలపై సెబీ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం ఏడాదిలో సంస్థ కార్పొరేట్ రుణాలు రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742 కోట్లు ఉన్న రుణాలు 2018-19 నాటికి రూ.8,670 కోట్లకు చేరాయి. అయితే అక్రమంగా ఆయా రుణాలను సమీకరించినట్లు ఈడీ పేర్కొంది.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...