ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్(BRS Working President KTR) పేరుతో కేకులు కట్ చేస్తూ, ఆయన్ని అభినందిస్తూ సాంఘిక సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానాలు, ఆసుపత్రుల్లో పళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌(BRS)కు చెందిన ప్రముఖ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ నివాసానికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

    MLC Kavitha | ట్వీట్ చ‌ర్చ‌..

    పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha), తన సోదరుడైన కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “అన్నయ్య.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అంటూ కవిత చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చకు కేంద్రబిందువైంది. కవిత, కేటీఆర్ మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో, ఈ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. “విభేదాలన్నీ పక్కన పెట్టి అన్నయ్యకు శుభాకాంక్షలు చెప్పిన తీరు నిజంగా గొప్పది”, “నీది మంచి మనసు అక్క”, అంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆవరణలో తీవ్ర చర్చలకు దారితీసింది.

    తండ్రి కేసీఆర్‌(KCR)ను  దేవుడిగా ప్రశంసించిన కవిత, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారని, పార్టీలో “కొవర్టుల” హవా నడుస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ గ్యాంగ్‌ని ఉద్దేశించి చేసిన‌వే అంటూ కొన్ని ప్రచారాలు సాగాయి. అయితే ఆ లేఖ వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య వ్యక్తిగత, రాజకీయ గ్యాప్ పెరిగిందని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కవిత ట్వీట్ ద్వారా మాత్రమే(Birthday Wishes) శుభాకాంక్షలు తెలపడం కొంత చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే ఆమె కేటీఆర్ ఇంటికి వెళ్లారా లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...