అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (National Institute of Technology) హై లెవల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నోటిఫికేషన్(Notification) వివరాలు..
మొత్తం పోస్టులు : 5.
పోస్టులవారీగా..
ప్రిన్సిపల్ సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ – 3.
ప్రిన్సిపల్ ఎస్‌ఏఎస్ ఆఫీసర్ – 1.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) – 01.
విద్యార్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, పీజీ(PG) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Executive Engineer) పోస్ట్‌కు 35 ఏళ్లు, ప్రిన్సిపల్ ఎస్‌ఏఎస్ ఆఫీసర్, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer) పోస్టుకు గరిష్ట వయోపరిమితి 56 ఏళ్లు.
వేతనం : ప్రిన్సిపల్ ఎస్‌ఏఎస్ ఆఫీసర్, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్‌కు నెల వేతనం రూ. 1,44,200. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు నెలకు రూ. 56,100.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్(Online) ద్వారా.
దరఖాస్తు గడువు: ఆగస్టు 17.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ(Interview) ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు.
పూర్తి వివరాలకు https://nitw.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.