ePaper
More
    HomeతెలంగాణMalnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్​ దందాపై ఈగల్​ టీమ్​ సభ్యులు దాడులు చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్​ ముసుగులో నడుపుతున్న డ్రగ్స్​ రాకెట్​ గుట్టును ఈగల్​ టీమ్ (Eagle Team)​ రట్టు చేసింది. అయితే ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    రెస్టారెంట్​ యజామని, నిందితుడు సూర్య వెనుక భారీ డ్రగ్ నెట్‌వర్క్ (Huge Drug Network) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్లతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. నైజీరియన్ డ్రగ్స్ డాన్ స్టాన్లీతో (Nigerian Drugs Don Stanley) కలిసి సూర్య నగరంలో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

    Malnadu Drugs Case | కస్టమర్లలో ప్రముఖులు

    నైజీరియన్లతో కలిసి నగరంలో సూర్య (Malnadu Restaurent Owner Surya) మల్నాడు రెస్టారెంట్ వేదికగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. ఆయన దగ్గర 600 మంది కస్టమర్లు డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, జిమ్ నిర్వాహకులు, బడాబాబుల పిల్లలు, పోలీసు అధికారుల పిల్లలు సైతం డ్రగ్స్​ కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు. వారికి దశలవారీగా నోటీసులు ఇచ్చి ఈగల్ టీమ్ విచారిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారుల పిల్లలను సైతం ఈగల్​ టీమ్​ అరెస్ట్​ చేసింది.

    Malnadu Drugs Case | డ్రగ్స్​ పార్టీల నిర్వాహణ

    సూర్య కస్టమర్లకు డ్రగ్స్​ సరఫరా చేయడంతో పాటు పలు పబ్​ల యజమానులతో కలిసి డ్రగ్స్​ పార్టీలు (Drugs Parties) నిర్వహించేవాడు. పబ్​లు, నగర శివారులోని రిసార్టులలో పార్టీలు ఏర్పాటు చేసేవాడు. ఇప్పటికే ఈగల్​ టీమ్​ పలు పబ్​ల యజమానులను అరెస్ట్​ చేసింది. ఈ కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...