ePaper
More
    Homeబిజినెస్​Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​ షాపింగ్​కు (Online Shopping) ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బ్యాంకులు క్రెడిట్​ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఆన్​లైన్​ షాపింగ్​ ప్రత్యేక ఆఫర్లు (Special Offers) ఇస్తున్నాయి. ఈ క్రమంలో అయితే తాజాగా ఎస్​బీఐ కార్డు, ఫోన్​ పే కలిసి సంయుక్తంగా క్రెడిట్​ కార్డులను తీసుకొచ్చాయి. ఇప్పటికే ఈ కామర్స్​ దిగ్గజాలు అయిన ఫ్లిప్​కార్ట్​తో యాక్సిక్​ బ్యాంక్​ జత కట్టి ఫ్లిప్​కార్ట్​ యాక్సిక్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డులతో కొనుగోలు చేసే వారికి ఫ్లిప్​కార్ట్ 5 శాతం క్యాష్​బ్యాక్​ ఇస్తోంది. అలాగే అమెజాన్​–ఐసీఐసీఐ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు డిమాండ్​ ఉండడంతో తాజాగా ఎస్​బీఐ ఫోన్​ పేతో (SBI Phone Pay) జతకట్టింది.

    Credit Cards | రెండు కార్డులు

    ఎస్​బీఐ కార్డు, ఫోన్​ పే కలిసి రెండు రకాల కార్డులను విడుదల చేశాయి. ఫోన్‌పే- ఎస్‌బీఐ పర్పుల్‌, ఫోన్‌పే- ఎస్‌బీఐ సెలెక్ట్‌ బ్లాక్‌ పేరిట కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డులను (Credit Cards) ఇస్తున్నాయి. ఇందులో బ్లాక్​ అనేది ప్రీమియం రకం కాగా.. పర్పుల్ సాధారణ రకం క్రెడిట్‌ కార్డు.

    Credit Cards | పది శాతం రివార్డు పాయింట్లు

    ఫోన్‌పే- ఎస్‌బీఐ సెలెక్ట్‌ బ్లాక్‌ కార్డు కోసం రూ.1,499 జాయినింగ్‌ ఫీజు ఉంటుంది. ఈ మొత్తాన్ని మొదటి సారి బిల్లు కట్టిన తర్వాత రూ.1,500 ఫోన్‌పే గిఫ్ట్‌ వోచర్‌ కింద చెల్లిస్తారు. అయితే రెండో ఏడాది నుంచి మాత్రం రూ.1499 రెన్యూవల్ ఫీజు ఉంటుంది. సంవత్సరానికి రూ.మూడు లక్షలకు మించి ఖర్చు చేసే వారికి దీనిని మాఫీ చేస్తారు. ఈ కార్డుతో ఫోన్​ పే నుంచి రీఛార్జులు, బిల్‌ పేమెంట్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి లావాదేవీలపై పది శాతం రివార్డు పాయింట్లు (10% Reward Points) ఇస్తారు. ఈ కామర్స్​ సైట్లలో కొనుగోళ్లపై 5 శాతం వరకు రివార్డులు లభిస్తాయి.

    ఈ కార్డును వినియోగించి స్కాన్​ అండ్​ పే (Scan and Pay), ట్యాప్​ అండ్​ పే (Tap and Pay) ద్వారా చెల్లింపులు చేస్తే ఒక శాతం రివార్డు పాయింట్లు వస్తాయి. ఇంధనం బిల్లులు చెల్లించే సర్‌ఛార్జి రద్దు చేస్తారు. ఏడాదిలో ఈ కార్డు ఉపయోగించి రూ.ఐదు లక్షలకు మించి ఖర్చు చేస్తే రూ.5 వేల విలువైన ట్రావెల్‌ వోచర్‌ కూడా లభిస్తుంది. దేశీయ ఎయిర్​పోర్టులలో ఉచితంగా నాలుగు లాంజ్​ యాక్సెస్​లు, ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులలో రూ.8 వేల విలువైన ప్రయారిటీ పాస్‌ ఉచితంగా లభిస్తాయి.

    Credit Cards | పర్పుల్‌ కార్డుతో మూడు శాతం రివార్డులు

    ఫోన్‌పే పర్పుల్‌ క్రెడిట్‌ కార్డు(PhonePe Purple Credit Card) కోసం రూ.499 జాయినింగ్​ ఫీజు ఉంటుంది. మొదటి నెల బిల్లు పేమెంట్​ తర్వాత రూ.500 ఫోన్​ పే గిఫ్ట్​ వోచర్​ ఇస్తారు. దీంతో జాయినింగ్​ ఫీ డబ్బులు వాపస్​ వస్తాయి. అయితే రెండో ఏడాది నుంచి మాత్రం రెన్యూవల్​ ఫీజు రూ.499 కట్టాల్సి ఉంటుంది. సంవత్సరానికి రూ.లక్షకు మించి ఖర్చు చేసే వారికి దీనిని మాఫీ చేస్తారు. ఈ కార్డు ద్వారా ఫోన్​ పే నుంచి చేసే రీఛార్జులు, బిల్లు పేమెంట్లపై మూడు శాతం వరకు రివార్డు పాయింట్లు ఇస్తారు. ఆన్​లైన్​ షాపింగ్​పై 2 శాతం వరకు రివార్డులు వస్తాయి. సంవత్సరానికి రూ.మూడు లక్షలకు మించి కొనుగోళ్లు చేసే వారికి రూ.3 వేలు విలువైన ట్రావెల్‌ వోచర్‌ ఉచితంగా ఇస్తారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...