ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లో వెలుగుచూసింది. ఇక్కడ ఆర్థిక సాయం చేసే గురువునే తన ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​కు పాల్పడింది సదరు శిష్యురాలు.

    అనంతపురం జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చదువుకునేందుకు సాయం చేసిన లెక్చరర్​ను బెదిరించి డబ్బులు గుంజుతూ వచ్చింది. తన ప్రియుడితో కలిసి తీవ్ర మనో వేదనకు గురిచేసి, గురువును ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించింది.

    Anantapur : సాయం చేయడమే పాపమన్నట్లు..

    పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌ సతీష్​కు ఎదురైన ఘటన ఇది. అదే కళాశాలలో చదువుకునే ఓ పేద విద్యార్థినికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో బాధిత లెక్చరర్​ డబ్బు సాయం చేశారు. తరచూ ఆయన అందించే సాయం ఆమెకు సరిపోలోదేమో.. ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బులు లాగాలని ప్రయత్నించింది.

    READ ALSO  Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

    ఇందుకు తన బాయ్​ ఫ్రెండ్​తో కలిసి పెద్ద ప్లానే వేసింది. ఈ ప్లాన్​లో భాగంగా.. ఆమె ప్రియుడు లెక్చరర్​కు ఫోన్​ చేశాడు. విద్యార్థినితో ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని, లైంగికంగా వేధిస్తున్నావని నిలదీశాడు. అదే ఫోన్​లో అమ్మాయిని కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నాడు ప్రియుడు. కన్నింగ్​ నేచర్​ ఉన్న శిష్యురాలు తన ప్రియుడికే వంత పాడింది. అలా ముగ్గురు మాట్లాడిన సంభాషణలను ప్రియుడు, ప్రియురాలు రికార్డ్ చేశారు.

    ఈ సంభాషణను అడ్డం పెట్టుకుని గురువును బ్లాక్​మెయిల్​ చేయసాగారు. అతడిని రచ్చకీడుస్తామని బెదిరించసాగారు. అలా లెక్చరర్ వద్ద అడపాదడపా రూ. లక్షన్నర వరకు వసూలు చేశారు.

    తన బాయ్​ ఫ్రెండ్​తో కలిసి పదే పదే డబ్బులు money డిమాండ్​ చేస్తూ వేధించడంతో లెక్చరర్​ lecturer సతీష్​ ఆత్మహత్యకు యత్నించారు. విషయం తన స్నేహితులకు తెలియడంతో వారు సతీష్​కు కౌన్సెలింగ్​ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు భయపడటం దేనికని ధైర్యం చెప్పి, పోలీసుల వద్దకు తీసుకొచ్చారు.

    READ ALSO  Tirumala | టీటీడీ సంచలన నిర్ణయం.. నలుగురు అన్యమత ఉద్యోగులపై వేటు

    Anantapur : పక్కా ప్లాన్​తో..

    అలా పోలీసుల Police సూచన మేరకు సతీష్ వారికి ఫోన్​ చేశాడు. డబ్బులు ఇస్తానని రమ్మన్నాడు. దీంతో ప్రియుడితో కలిసి ఆ మోసవన్నె శిష్యురాలు student అక్కడికి రాగా.. సతీష్​ డబ్బులు ఇచ్చారు. వారు తీసుకున్న వెంటనే.. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాశకు పోయి, ప్రియుడితో కలిసి సాయం చేసిన గురువునే మోసం చేయాలని చూసిన కన్నింగ్​ నేచర్​ విద్యార్థిని ప్రస్తుతం జైల్లో jail  ఊచలు లెక్కిస్తోంది.

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this