ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Scanning Centers | స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలి

    Scanning Centers | స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Scanning Centers | జిల్లాలో కొనసాగుతున్న స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

    నిబంధనలు అతిక్రమిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష (Fetal determination test) నిషేధ చట్టం జిల్లా స్థాయి అడ్వైయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.

    Scanning Centers | ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు..

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ సెంటర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలని ఆదేశించారు. ఏ స్కానింగ్ కేంద్రంలో అయినా లింగ నిర్ధారణ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి సెంటర్ల అనుమతులు రద్దు చేయాలని, అవసరమైతే సీజ్ చేయాలని చెప్పారు.

    READ ALSO  Railway Line | ఎంపీ చొరవతో ఆర్మూరు మీదుగా పటాన్​చెరు‌‌ – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు

    Scanning Centers | రుసుము పట్టిక ఏర్పాటు..

    ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు నిర్ణీత రుసుమును మాత్రమే వసూలు చేయాలన్నారు. ఛార్జీలు గురించి తెలియజేసేలా పట్టిక ప్రదర్శించాలని పేర్కొన్నారు. అబార్షన్ కోసం వాడే ఔషధాలను క్వాలిఫైడ్ డాక్టర్ రిఫరల్ లేనిదే మెడికల్ షాపుల్లో (Medical shops) విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాల రికార్డులను, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.

    ఆడపిల్ల ప్రాధాన్యతపై, భేటీ బచావో బేటీ పడావోపై(Beti bachavo.. beti padavo), పాఠశాలల్లో కళాశాలలో, గ్రామ, మండల స్థాయి సమాఖ్య సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీ (DMHO Rajshri), డిప్యూటీ డీఎంహెచ్​వో తుకారాం రాథోడ్, ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, లీగస్​ ప్రతినిధి రవి ప్రసాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

    READ ALSO  Ration Cards | 25 నుంచి మండలకేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ

    Latest articles

    Thailand AIR Strikes | మరో యుద్ధం తప్పదా.. కంబోడియాపై థాయిలాండ్​ వైమానిక దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్​ గురువారం వైమానిక దాడులకు దిగింది....

    MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  పుట్టిన...

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    More like this