ePaper
More
    Homeక్రైంMedak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medak | మెదక్​ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్​ కారును ఢీకొనడమే కాకుండా.. ఆపమంటే సదరు వ్యక్తిపై నుంచి లారీని తీసుకెళ్లాడు. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మెదక్ జిల్లాలోని నార్సింగి NH 44పై ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.

    సత్తిరెడ్డి అనే వ్యక్తి కారులో నార్సింగి నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్నాడు. అయితే హైవేపై కారును ఓ లారీ ఢీకొంది. అనంతరం సదరు డ్రైవర్​ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. దీంతో సత్తిరెడ్డి లారీని చేజ్​ చేశాడు. లారీని అడ్డగించి.. డ్రైవర్‌కు కిందకు దిగమని హెచ్చరించాడు. అయితే లారీ డ్రైవర్​ కిందకు దిగకుండా సత్తిరెడ్డిని ఢీకొంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...