ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్​ నాయకుడు (BJP Leader) బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)ను ఉపరాష్ట్రపతి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్​ చేశారు. ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ (Jagdeep Dhankhad) ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నిక నిర్వహించనున్నారు.

    ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి (Vice President) పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆయనకు పదవి ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. తాను ఇండియా కూటమి తరఫున కాకుండా.. తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుతున్నాని రేవంత్​ రెడ్డి అన్నారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమితో మాట్లాడుతానని పేర్కొన్నారు. కాగా దత్తాత్రేయ మొన్నటి వరకు హర్యానా గవర్నర్​గా పని చేశారు.

    READ ALSO  Hyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

    CM Revanth Reddy | బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం

    బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని సీఎం అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారని ఆయన గుర్తు చేశారు. కానీ కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు రామచందర్​రావు మాత్రం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల్లో నుంచి ముస్లింలను తీసేయాలని బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గుజరాత్‌, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. అక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఇక్కడ మాట్లాడండని చురకలు వేశారు.

    CM Revanth Reddy | కేంద్రంపై ఒత్తిడి తేవడానికి..

    రాష్ట్రంలో కుల గణన (Caste Census)ను విజయవంతంగా నిర్వహించామని సీఎం తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. ఆ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపేలా.. ఒత్తిడి తేవాలని రాహుల్‌, ఖర్గేను కోరడానికి ఢిల్లీ వెళ్లినట్లు ఆయన చెప్పారు. గురువారం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై వివరిస్తామని ఆయన తెలిపారు.

    READ ALSO  Raj Gopal Reddy | సీఎం వ్యాఖ్య‌ల‌పై రాజ‌గోపాల్‌రెడ్డి అస‌హ‌నం.. కాంగ్రెస్ విధానాల‌కు వ్య‌తిరేక‌మ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

    Latest articles

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    More like this

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...