ePaper
More
    Homeక్రీడలుINDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య నాలుగో టెస్ట్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్‌‌కు టీమిండియా జ‌ట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. వరుసగా మూడు టెస్ట్‌ల్లో విఫలమైన కరుణ్ నాయర్‌పై (Karun Nair) వేటు వేసి సాయి సుదర్శన్‌కి అవ‌కాశం ఇచ్చింది. ఇక గాయాలతో జట్టుకు దూరమైన ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి స్థానాలను భ‌ర్తీ చేసే క్ర‌మంలో అన్షూల్ కంబోజ్, శార్డూల్ ఠాకూర్‌లని తీసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగించ‌డం కొస‌మెరుపు. బ్యాటింగ్ డెప్త్ కోసమే సుందర్‌ను తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోను ఇంగ్లండ్ జ‌ట్టు టాస్ గెల‌వ‌గా, భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.

    INDvsENG | ప‌ట్టు బిగించింది..

    ఓపెన‌ర్స్ కేఎల్ రాహుల్‌(KL Rahul)( 40 నాటౌట్),జైస్వాల్ ( 36 నాటౌట్‌) వికెట్ ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గాఆడారు. దీంతో లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కాస్త స్పీడ్‌గా ఆడిన‌ట్టు క‌నిపించింది. వోక్స్, ఆర్చ‌ర్, కార్స్, స్టోక్స్ బౌలింగ్ చేసిన కూడా వికెట్ తీయ‌లేక‌పోయారు. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ప్ప‌నిస‌రి గెల‌వాల్సి ఉన్న నేప‌థ్యంలో ఓపెన‌ర్స్ విలువైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీం ఇండియా 1-2 తేడాతో వెనుకబడి ఉన్న విష‌యం తెలిసిందే. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ (England) 5 వికెట్ల తేడాతో విజయం సాధించ‌గా, రెండో టెస్ట్ లో భారత్ 336 పరుగుల తేడాతో విజయం ఘ‌న విజ‌యం సాధించింది. మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచి ఆదిక్యం సంపాదించుకుంది..

    READ ALSO  AB de Villiers | దంచికొట్టిన డీవిలియ‌ర్స్.. భారత్‌పై సౌతాఫ్రికా చాంపియన్స్ ఘన విజయం!

    ఇంగ్లాండ్ జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ కు అవకాశం లభించింది. మిగిలిన 10 మంది ఆటగాళ్ళు లార్డ్స్ టెస్ట్‌(Lords Test Match)లో ఆడిన ఆట‌గాళ్లే ఉన్నారు..

    INDvsENG | రెండు జట్ల ప్లేయింగ్-ఎలెవన్ చూస్తే..

    భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్.

    ఇంగ్లాండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (w), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.

    READ ALSO  WTC Finals | ఐసీసీ నిర్ణ‌యంతో నిరాశ‌లో భార‌త్.. 2031 వరకు WTC ఫైనల్స్ అక్కడే..!

    Latest articles

    Flight Missing | రష్యాలో విమానం మిస్సింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flight Missing | రష్యాలో విమానం మిస్​ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane)...

    Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్​ ఇచ్చారు....

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...

    Thailand AIR Strikes | మరో యుద్ధం తప్పదా.. కంబోడియాపై థాయిలాండ్​ వైమానిక దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్​ గురువారం వైమానిక దాడులకు దిగింది....

    More like this

    Flight Missing | రష్యాలో విమానం మిస్సింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flight Missing | రష్యాలో విమానం మిస్​ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane)...

    Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్​ ఇచ్చారు....

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...