ePaper
More
    Homeక్రీడలుAndre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన వెస్టిండీస్ సూపర్ స్టార్ ఆండ్రీ రస్సెల్, నేడు తన అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలికాడు. జమైకాలోని సబీనా పార్క్(Sabina Park) వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి అంత‌ర్జాతీయ క్రికెట్‌(International Cricket)కి వీడ్కోలు ప‌లికాడు. వెస్టిండీస్ 98/5 వద్ద కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్, బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో బంతికే సిక్స్‌తో ఖాతా తెరిచిన రస్సెల్, 7 బంతుల్లోనే 20 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటాడు.

    Andre Russell | ఆట‌కి గుడ్ బై..

    ఆడమ్ జంపా బౌలింగ్‌(Adam Zampa Bowling)లో ఒక ఫోర్, ఒక సిక్స్ బాదిన రస్సెల్, చివరికి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆండ్రీ రస్సెల్‌(Andre Russell)కి ఈ మ్యాచ్‌ ప్రారంభంలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. రెండు జట్ల ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ రస్సెల్‌ను గౌరవించారు. మ్యాచ్‌ అనంతరం కూడా ఆటగాళ్లంతా అతని వద్దకు వెళ్లి అభినందనలు తెలపడం ఎమోషనల్ మూమెంట్‌గా మారింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (West Indies Cricket Board) ప్రత్యేకంగా బహుమతిని అందించి గౌరవించింది. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే .. వెస్టిండీస్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో 172 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఎక్కువ పరుగులు రస్సెల్ బ్యాట్ నుంచే వచ్చాయి.

    ఆస్ట్రేలియా(Australia) బౌలింగ్ చూస్తే ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా, మ్యాక్స్‌వెల్, ఎల్లిస్ చెరో 2 వికెట్లు తీసారు. ఆస్ట్రేలియా ఛేజింగ్‌లో అద‌ర‌గొట్టింది. జోష్ ఇంగ్లిస్ (78), కామెరూన్ గ్రీన్ (56) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఇక ఆండ్రీ రస్సెల్ తన చివరి మ్యాచ్‌లో సాధించిన స్కోరు, ఆటగాళ్ల నుంచి పొందిన గౌరవం, అభిమానుల స్పందన ఇవన్నీ కలిపి అతని అంతర్జాతీయ ప్రయాణానికి గౌరవప్రద ముగింపునిచ్చాయి. అతని పవర్ హిట్టింగ్ మిస్ అయినా, మిలియన్ల మంది క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ఈ జమైకన్ డైనమైట్ గుర్తుండిపోతాడు.

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...