ePaper
More
    HomeతెలంగాణHydraa Commissioner | రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలి.. హైడ్రా సిబ్బందికి కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాలు

    Hydraa Commissioner | రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలి.. హైడ్రా సిబ్బందికి కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa Commissioner | హైదరాబాద్​ నగరంలో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్​ రంగనాథ్(Hydraa Commissioner Ranganath)​ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలమయం అయిన రోడ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

    మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో నీట మునుగుతున్న రహదారులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డి వాటరింగ్​ పంపులు పనిచేయక కొత్తగూడ (Kothaguda) చౌరస్తాలో ఆర్​యూబీలో నీరు నిలిచిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం మోటార్లకు మరమ్మతులు చేయించడంతో ఎలాంటి ఇబ్బంది లేదని సిబ్బంది తెలిపారు. ఆర్​యూబీ వద్ద హైడ్రా పంపులను కూడా సిద్ధంగా ఉంచాలని కమిషనర్​ ఆదేశించారు.

    READ ALSO  MP Aravind | అధిష్టానం జోక్యం చేసుకోవాలి.. బండి, ఈట‌ల వివాదంపై అర్వింద్

    Hydraa Commissioner | సమన్వయంతో పని చేయాలి

    ట్రాఫిక్ పోలీసులతో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ (Hydraa Monsoon Emergency), డీఆర్​ఎఫ్​ బృందాలు (DRF Teams) కలిసి పని చేయాలని కమిషనర్​ రంగనాథ్​ సూచించారు. వరద ముప్పు ప్రాంతాల్లో నిరంతరం సేవలందించే స్టాటిక్ టీమ్​లు ట్రాఫిక్ పోలీసులకు (Traffic Police) అందుబాటులో ఉండాలన్నారు. జీహెచ్​ఎంసీ కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్​తో పాటు హైడ్రా కమిషనర్​ బయోడైవర్సిటీ ప్రాంతంలో నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. వంతెనల మీద కూడా నీరు పోయే రంధ్రాల్లో మట్టి చేరకుండా చూడాలని ఆదేశించారు.

    గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రధాన రహదారి మీదుగా వచ్చిన వరద వెళ్లే నాలా కబ్జా అయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో వరద నీరు గమన్ హాస్పిటల్ (Gaman Hospital) లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుందని వాపోయారు. దీంతో ఆ నాలాను పునరుద్ధరించాలని కమిషనర్​ రంగనాథ్​ ఆదేశించారు.

    READ ALSO  Railway | రైలు ప్రయాణికులకు అలర్ట్​.. పెద్దపల్లి జంక్షన్​లో బైపాస్​ రైల్వే మార్గం నిర్మాణం.. పలు రైళ్లు రద్దు..

    Latest articles

    Madhya Pradesh | నడిరోడ్డుపై గుర్రాల ఫైటింగ్… క‌ట్‌చేస్తే ఆటోలో ఇరుక్కున్న అశ్వం..వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Madhya Pradesh | మ‌నుషులే కాదు జంతువులు కూడా కొన్ని సంద‌ర్భాల‌లో భీక‌ర‌మైన ఫైటింగ్ చేస్తుండ‌డం...

    Mopal | కులాస్​పూర్​లో దొంగల బీభత్సం.. పదిళ్లలో చోరీ

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Mopal | మోపాల్​ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఏకంగా పదిళ్లలో...

    Sri Ram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్పంగా పెరిగిన ఇన్​ఫ్లో

    అక్షరటుడే, ఆర్మూర్ : Sri Ram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్​ సాగర్​(Sri Ram...

    Russia Plane Crash | రష్యాలో కూలిపోయిన విమానం.. 50 మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Russia Plane Crash | రష్యాలో విషాదం చోటు చేసుకుంది. అదృశ్యమైన అంగారా ఎయిర్​లైన్స్​...

    More like this