ePaper
More
    HomeతెలంగాణRajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)లో ఆయన పదవి ఆశించారు.

    అయితే సామాజికి సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్​రెడ్డికి కేబినెట్​ బెర్త్​ దక్కలేదు. బుధవారం ఆయన మాట్లాడుతూ. 2018 ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే(Congress MLA)లు అందరు ఓడిపోతే తాను మాత్రమే గెలిచానన్నారు. 2023 ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. కానీ తనకు మంత్రి పదవి కంటే మునుగోడు ప్రజలే ముఖ్యమన్నారు. అందుకే అక్కడి నుంచి పోటీ చేయలేదన్నారు.

    Rajagopal Reddy | అందుకే ఉప ఎన్నికల్లో ఓడిపోయా

    రాజగోపాల్​రెడ్డి 2018లో కాంగ్రెస్​ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2022 నవంబర్​లో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. బీజేపీ నుంచి రాజగోపాల్​రెడ్డి(Rajagopal Reddy) పోటీ చేశారు. బీఆర్​ఎస్​ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే ఉప ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాన్ని తాజాగా రాజగోపాల్​ రెడ్డి వెల్లడించారు. ఆ ఎన్నికల్లో తనను ఓడించిది బీఆర్​ఎస్​ కాదని, కమ్యూనిస్టులని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్​(BRS)కు మద్దతు తెలపడంతోనే ఉప ఎన్నికల్లో ఓడిపోయినట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్​రెడ్డి అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ముందు మళ్లీ కాంగ్రెస్​లో చేరి మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు.

    More like this

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి...

    Asia Cup | క్రికెట్ పండుగ మళ్లీ మొదలైంది.. నేటి నుంచి ఆసియా కప్.. లైవ్ డీటెయిల్స్, ఫుల్ షెడ్యూల్ ఇదిగో!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా...

    Uttar Pradesh | 15 రోజుల శిశువుని ఫ్రీజ‌ర్‌లో పెట్టి మ‌రిచిపోయిన త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Moradabad District)లో చోటు చేసుకున్న ఓ విషాద...