ePaper
More
    HomeతెలంగాణRailway Line | ఎంపీ చొరవతో ఆర్మూరు మీదుగా పటాన్​చెరు‌‌ – ఆదిలాబాద్ కొత్త రైల్వే...

    Railway Line | ఎంపీ చొరవతో ఆర్మూరు మీదుగా పటాన్​చెరు‌‌ – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Railway Line | జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇప్పటికే జిల్లా మీదుగా పలు ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్మూర్​ మీదుగా మరో రైల్వే లైన్(Railway Line)​ మంజూరు చేస్తూ.. రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    పటాన్​చెరు నుంచి ఆర్మూర్(Patancheru to Armur)​ మీదుగా ఆదిలాబాద్​ వరకు కొత్త రైల్వే లైన్​కు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. నిజామాబాద్​లో రైల్వే సౌకర్యాలు.. దాని విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్​కు ముందడుగు పడింది. పటాన్​చెరు, ఆదిలాబాద్ మధ్య ఆర్మూర్ మీదుగా రైల్వేలైన్ వేయాలని గత రెండేళ్లుగా ఎంపీ అర్వింద్​ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav)​ను పలుమార్లు కోరారు. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి ఎంపీ అర్వింద్​(MP Aravind)కు లేఖ రాశారు.

    READ ALSO  Telangana BJP | బీజేపీలో తొల‌గ‌ని విభేదాలు.. కొండా ఇంట్లో విందు.. డుమ్మా కొట్టిన బండి, కిష‌న్‌రెడ్డి

    Railway Line | డీపీఆర్ తయారీ

    ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. డీపీఆర్ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని లేఖలో పేర్కొన్నారు. కాగా, తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్​ కేంద్రమంత్రి(Union Minister)కి కృతజ్ఞతలు తెలిపారు.

    Railway Line | ఎంపీ అర్వింద్​ కృషి

    పటాన్​చెరు నుంచి ఆదిలాబాద్​ వరకు ఆర్మూర్​ మీదుగా రైల్వే లైన్​ మంజూరు చేయాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తీవ్రంగా కృషి చేశారు. ఈ మేరకు పలుమార్లు ఆయన రైల్వేశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ మంత్రి రైల్వే లైన్​ మంజూరు చేశారు. అంతేగాకుండా నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఆర్వోబీల నిర్మాణం విషయంలో సైతం ఎంపీ తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో పలు ఆర్వోబీల నిర్మాణం పూర్తి కాగా.. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

    READ ALSO  MP Aravind | అధిష్టానం జోక్యం చేసుకోవాలి.. బండి, ఈట‌ల వివాదంపై అర్వింద్

    Railway Line | ప్రయాణికుల కోసం వసతుల కల్పన

    రాష్ట్రంలో నిత్యం ఎంతో మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వేగంగా వెళ్లడానికి పలు మార్గాల్లో వందే భారత్​ రైళ్లను రైల్వే శాఖ(Railway Department) నడుపుతోంది. అలాగే రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను సైతం వేస్తోంది. అంతేగాకుండా అమృత్​ భారత్​ స్కీమ్​లో భాగంగా రైల్వే స్టేషన్​లను ఆధునిక హంగులతో పునరుద్ధరిస్తోంది. నిజామాబాద్​, కామారెడ్డి రైల్వే స్టేషన్​లలో ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా కేంద్రం పటాన్​చెరు నుంచి ఆర్మూర్​ మీదుగా ఆదిలాబాద్​ వరకు రైల్వే లైన్​ మంజూరు చేసింది. దీంతో ఈ మార్గంలో ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. కేంద్ర నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Hyderabad Rains | హైదరాబాద్​లో దంచికొట్టిన వాన​.. చెరువులను తలపించిన రోడ్లు.. నగరవాసుల అవస్థలు

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...