ePaper
More
    Homeబిజినెస్​TATA AIA | ఎండీఆర్టీ ర్యాంకింగ్స్‌లో టాటా ఏఐఏకు అగ్రస్థానం

    TATA AIA | ఎండీఆర్టీ ర్యాంకింగ్స్‌లో టాటా ఏఐఏకు అగ్రస్థానం

    Published on

    అక్షరటుడే, ముంబై: TATA AIA | ఆర్థిక సేవల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Life Insurance Company Limited) కీలక విజయాన్ని సాధించింది. మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ ర్యాంకింగ్స్‌లో (Million Dollar Round Table Rankings) భారతదేశంలో వరుసగా మూడో ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గతేడాదితో పోలిస్తే ఈసారి MDRT సభ్యుల సంఖ్య 11 శాతం పెరిగి 2,871కి చేరుకుందని టాటా ఏఐఏ (TATA AIA) హర్షం వ్యక్తం చేసింది.

    TATA AIA | మహిళా సాధికారతలో ముందంజ..

    వైవిధ్యం, సమ్మిళితత్వానికి టాటా ఏఐఏ ఇస్తున్న ప్రాధాన్యత ఈ విజయాలలో ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థలో 1,343 మంది మహిళా MDRT సభ్యులు ఉండడం ఒక ఆల్‌టైమ్ హై రికార్డు(All Time High Record). మహిళా సభ్యత్వంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 25 కంపెనీలలో ఏడో స్థానంలో నిలవడం విశేషం. మహిళా MDRT అర్హత సాధించిన వారిలో 8.5 శాతం వృద్ధి, ఆర్థిక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి టాటా ఏఐఏ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనం. MDRT సభ్యత్వం అనేది జీవిత బీమా, ఆర్థిక సేవల నిపుణులకు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణంగా పరిగణించబడుతుంది.

    READ ALSO  Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ

    TATA AIA | వ్యాపార వృద్ధికి చోదక శక్తి..

    MDRT అర్హత కలిగిన సలహాదారులు బీమా సంస్థలకు గొప్ప బలాన్ని అందిస్తారు. వారి నిపుణులైన మార్గదర్శకత్వం వినియోగదారుల సంతృప్తిని పెంచి, బ్రాండ్‌పై విశ్వసనీయతను ఇనుమడింపజేస్తుంది. టాటా ఏఐఏలో, MDRT సలహాదారులు అద్భుతమైన సేవలను అందిస్తూ, బలమైన కస్టమర్ బేస్‌ను సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంవత్సరం 2024-25లో, టాటా ఏఐఏ ఐదు పర్సిస్టెన్సీ (పాలసీ పునరుద్ధరణ) కోహోర్ట్‌లలో నాలుగింటిలో అగ్రస్థానంలో నిలిచింది.

    ఈ విజయంపై టాటా ఏఐఏ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ – ప్రొప్రైటరీ బిజినెస్, అలైడ్ ఛానెల్స్ అండ్ ఏజెన్సీ సేల్స్, అమిత్ డేవ్(Amit Dave) మాట్లాడుతూ.. “MDRT ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలవడం, భారతదేశంలో పరిశ్రమకు నాయకత్వం వహించడం నిజంగా మాకు గర్వకారణం. ఈ మైలురాయి మా ప్రీమియర్ ఏజెన్సీ మోడల్ విజయానికి, మా సలహాదారుల అంకితభావానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.

    READ ALSO  Reliance | రిలయన్స్‌.. అదుర్స్‌.. నికర లాభం 78 శాతం జంప్‌

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this