ePaper
More
    HomeజాతీయంKanwar Yatra | కన్వర్ యాత్రికులపై దూసుకెళ్లిన కారు

    Kanwar Yatra | కన్వర్ యాత్రికులపై దూసుకెళ్లిన కారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kanwar Yatra | మధ్యప్రదేశ్​లో విషాదం చోటు చేసుకుంది. కన్వర్​ యాత్రికులపైకి ఓ కారు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్-శివపురి(Gwalior-Shivapuri) లింక్‌రోడ్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

    మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్ జిల్లా ఉటిల్లా ప్రాంతంలోని భదవానా సరస్సు సమీపంలో కారు భక్తులను ఢీకొంది. కన్వర్​ యాత్రికులు గంగా జలంతో తిరిగి వస్తుండగా శివపురి లింక్ రోడ్డుపై వేగంగా వస్తున్న కారు వారిపైకి దూసుకెళ్లింది. అనంతరం ఆ కారు లోయలో పడిపోయింది. మంగళవారం అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డును దిగ్బందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

    Kanwar Yatra | కన్వర్​ యాత్ర అంటే..

    ఉత్తర భారత్​లో కన్వర్​ యాత్ర(Kanwar Yatra)కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. భక్తులు గంగా జలాన్ని కావడిలో తీసుకొచ్చి తమ ప్రాంతంలోని శివలింగానికి(Shivalingam) అభిషేకం చేస్తారు. శ్రావణ మాసం(Shravana Masam)లో ఈ యాత్ర చేపడుతారు. గంగా జలాన్ని కిలో మీటర్ల మేర కావడిలో మోసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. ఇలా అభిషేకం చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

    More like this

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...