ePaper
More
    HomeజాతీయంMaharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో దుర్మార్గం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను చంపిందో కసాయి పెళ్లాం. తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పైకి ఏర్పడకుండా టైల్స్ కూడా వేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లా (Palghar district) లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

    Maharashtra : వివరాల్లోకి వెళ్తే..

    ధనివ్​ బాగ్ ప్రాంతంలో విజయ్ చౌహాన్​ (34), చమన్ అలియాస్​ గుడియా దేవి (32) దంపతులు ఉంటున్నారు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లి అయింది. రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా గుడియా దేవికి వీరి ఇంటి పక్కనే ఉండే మోను విశ్వకర్శ (33) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

    ఈ క్రమంలో వీరి అక్రమ బంధానికి విజయ్​ అడ్డుగా ఉన్నాడని గుడియా, విశ్వకర్మ భావించారు. అతడిని కడతేర్చాలని ప్లాన్​ వేశారు. సుమారు పక్షం రోజుల క్రితం వారు కలిసి అమాయక భర్త విజయ్​ను ఇంట్లోనే హత్య చేశారు.

    అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. ఏకంగా ఇంట్లోనే గొయ్యి తవ్వారు. అందులో పాతిపెట్టి, పైన ఏర్పడకుండా కొత్త టైల్స్ వేశారు.

    Maharashtra : చేసిన పాపం దాగదుగా..

    ఇదిలా ఉంటే విజయ్​ తోబుట్టువులు ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు మనీ అవసరం కావడంతో విజయ్​ సాయం కోసం వచ్చారు. విజయ్​కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్​ఆఫ్​ రావడంతో నేరుగా ఇంటికి వెళ్లగా.. తన భర్త కుర్లా వెళ్లినట్లు గుడియా చెప్పి, వారిని వెనక్కి పంపించింది.

    కొద్ది రోజులకు (జులై 19) వారు గుడియాకు ఫోన్​ చేశారు. విజయ్​ వచ్చాడో లేదో తెలుసుకోవడానికి. కానీ, వారికి గుడియా ఫోన్​ Phone కూడా స్విచ్​ ఆఫ్​ అని వచ్చింది. దీంతో విజయ్ తోబుట్టువులు అనుమానంతో పెల్హార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్​ ఇంటిని House పరిశీలించారు. ఫ్లోర్​పై కొత్త టైల్స్ కనిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూడగా.. విజయ్​ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

    స్థానిక తహసీల్దార్​ tehsildar నేతృత్వంలో వైద్యులు Doctors, ఫోరెన్సిక్​ forensic నిపుణులు ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్​మార్టం నిమిత్తం ముంబయి (Mumbai) లోని జేజే ప్రభుత్వ ఆసుపత్రి (JJ Government Hospital) కి మృతదేహాన్ని పంపించారు.

    More like this

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...

    Stock Market | నిలదొక్కుకున్న మార్కెట్లు.. 81 వేల మార్క్‌ను మరోసారి దాటిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గత నాలుగైదు సెషన్లు కొనసాగుతున్న ట్రెండ్‌కు బ్రేక్‌ పడిరది. ఒడిదుడుకులకు...

    7th Bettalion | ఏడో బెటాలియన్​లో ఉచిత హెల్త్ క్యాంప్

    అక్షరటుడే, డిచ్​పల్లి : 7th Bettalion | మండలంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్(7th Bettalion)​లో మంగళవారం...