ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | తెయూ పరీక్షల తేదీల ప్రకటన

    Telangana University | తెయూ పరీక్షల తేదీల ప్రకటన

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆయా కోర్సులకు సంబంధించి తేదీలు ప్రకటించినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సంపత్​ కుమార్​ తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

    పీజీ రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్​డబ్ల్యూ (MSW), ఎంకాం, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఎల్‌ఐఎస్​బీ(బీఎల్‌)లలో ఈనెల 31వ తేదీనుంచి ఆగస్టు 14 వరకు ఉంటాయని వివరించారు. అలాగే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులైన (Integrated course) ఐఎంబీఏ, ఏపీఈ, ఐపీసీహెచ్‌ రెండు, ఆరో సెమిస్టర్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఎంబీఏ ఎనిమిది, పదో సెమిస్టర్‌ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సైతం పైన తెలిపిన తేదీల్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

    Telangana University | తెయూలో రెండురోజుల సెమినార్‌

    తెయూ (Telangana University) అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎంపవరింగ్‌ ఇండియా–2047.. స్ట్రాటజీస్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్మెంట్‌ (Strategies for Sustainable Development) అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ నిర్వహించనున్నట్లు సెమినార్‌ కన్వీనర్‌ పున్నయ్య తెలిపారు.

    కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి (State Council of Higher Education) ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకృష్ణారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తం ముఖ్య అతిథులుగా, వర్సిటీ వీసీ టి యాదగిరి రావు (VC T Yadagiri Rao), రిజిస్ట్రార్‌ ఎం యాదగిరి అతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి కీలక ఉపన్యాసం చేస్తారని, సెమినార్‌లో వివిధ వర్సిటీల నుంచి సుమారు 140 మంది పత్ర సమర్పణ చేయనున్నారని కన్వీనర్‌ పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...