ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGold Prices | పసిడి పరుగులు.. రూ.లక్ష మార్క్​ను టచ్​ చేసిన ధర

    Gold Prices | పసిడి పరుగులు.. రూ.లక్ష మార్క్​ను టచ్​ చేసిన ధర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Gold Prices | బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. శ్రావణ మాసం (Shravan Masam) పెళ్లిళ్ల సీజన్​ కావడంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధర ఉంటుంది. మంగళవారం కామారెడ్డిలో (Kamareddy) తులం బంగారం ధర రూ. లక్ష పలికింది.

    సోమవారం సాయంత్రం తులం బంగారం ధర రూ.99,600 ఉండగా మంగళవారం రూ. లక్ష మార్క్​ను టచ్​ చేసింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు(Gold Prices) పెరుగుతూనే ఉన్నాయి.

    Gold Prices | ఈనెల 26వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్​

    ప్రస్తుతం ఈనెల 26 నుంచి పెళ్లిళ్లకు శుభముహూర్తాలు ఉన్న వేళ.. బంగారం ధరలు(Gold Rates) పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్(Wedding Season) మొదలయ్యే వరకు తగ్గుతుందని భావించిన ప్రజలకు మంగళవారం నాటి ధరలు షాక్​కు గురిచేశాయి. రూ.లక్షతో ఆగకుండా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్వర్ణకారులు చెబుతున్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...